Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేఅని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి.
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని ఆయన ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేఅని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి.
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు తాజాగా గుర్తించారు. వీరు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang)కు చెందిన వారని, నిందితులు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసు వర్గాలు సోమవారం వెల్లడించాయి. సదరు వర్గాల సమాచారం మేరకు.. నిందితుల్లో విశాల్‌అనే వ్యక్తిపై గతంలో హింసాత్మక నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అతడికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గోదారాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన గురుగ్రామ్‌కు చెందిన వ్యాపారవేత్త సచిన్ ముంజాల్‌ను హత్య కేసులో విశాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రోహిత్ గోదారా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ముంజాల్ హత్యను అంగీకరించినట్లు తెలిసింది.
కాగా, ఆదివారం ఉదయం 4.51 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం గెలాక్సీ అపార్టుమెంట్స్ బయట నాలుగు రౌండ్లు కాల్చారు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా అపార్ట్‌మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి వాటి ఆధారంగా ఇద్దరు నిందితుల్ని తాజాగా గుర్తించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గతంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండల వీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. దీంతో ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. గతేడాది ఏప్రిల్ 11న సల్మాన్‌కు చంపుతామంటూ బెదిరిస్తూ ఈ- మెయిల్ వచ్చింది. యూకేలో ఉంటున్న భారత యువకుడు అది చేసినట్లు గుర్తించిన పోలీసులు, అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు.
Also Read..
Kokapet | కోకాపేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..
Madhya Pradesh | కరెంట్ కట్‌చేయడానికి వెళ్తే కర్రలతో కొట్టారు..
Israel | బహుళ అంచెల రక్షా కవచం.. శత్రు దుర్భేద్యం ఇజ్రాయెల్ గగనతలం