Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Samyuktha Menon | నిఖిల్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సంయుక్త మీనన్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 11, 2024No Comments

Samyuktha Menon | ప్ర‌స్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్‌లో మంచి సక్సెస్‌ రేట్‌ ఉన్న కథానాయిక అంటే వెంటనే గుర్తొచ్చేది న‌టి సంయుక్త మీనన్‌. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు సంయుక్త చేసిన అని సినిమాలు విజయాలే. బీమ్లానాయక్‌, బింబిసార, సర్‌, విరూపాక్ష రీసెంట్‌గా వ‌చ్చిన ‘డెవిల్‌’ ఇలా ప్ర‌తి సినిమాతో మంచి హిట్ అందుకుంది.

February 11, 2024 / 09:59 AM IST
Samyuktha Menon | నిఖిల్ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సంయుక్త మీనన్‌

Samyuktha Menon | ప్ర‌స్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్‌లో మంచి సక్సెస్‌ రేట్‌ ఉన్న కథానాయిక అంటే వెంటనే గుర్తొచ్చేది న‌టి సంయుక్త మీనన్‌. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు సంయుక్త చేసిన అని సినిమాలు విజయాలే. బీమ్లానాయక్‌, బింబిసార, సర్‌, విరూపాక్ష రీసెంట్‌గా వ‌చ్చిన ‘డెవిల్‌’ ఇలా ప్ర‌తి సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ భామ ప్ర‌స్తుతం రెండు సినిమాల‌లో న‌టిస్తుంది. అందులో ఒక‌టి నిఖిల్ హీరోగా వస్తున్నా స్వయంభు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం నిఖిల్ గుర్ర‌పు స్వారీ నేర్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా సంయుక్త మీన‌న్ కూడా హార్స్ రైడింగ్ మొద‌లుపెట్టింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ సోష‌ల్ మీడియాలో ఒక స్పెష‌ల్ పోస్ట్ పెట్టింది.

2024 నా గురించి.. నా జీవితం గురించి చాలా విషయాలు నేర్పించింది. జీవితంలో సాహసాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నాకంటూ సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకుని అందులోనే ఉండాలనుకోను.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నటిగా నేను కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటున్నాను అలాగే వాటిని అమలు చేయాలనుకుంటున్నాను. రోజువారీ జీవితంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. నేను ప్రస్తుతం నా తదుపరి చిత్రం స్వయంభు కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాను.. నన్ను నమ్మండి ఈ ప్రయాణం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. గుర్రంపై ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం. మనశ్సాంతిగా ఉంటుంది. గుర్రపు స్వారీ ప్రతి అడ్డంకిని తొలగిస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ సంయుక్త రాసుకొచ్చింది.

2024 embarked with a lot of learning about myself and about many things that makes life what it truly is. I have always been game for adventures in life. I never had a comfort zone because I always pushed myself to explore newer experiences 💫

As an actor, I am blessed to be… pic.twitter.com/lcW1nhNnY7

— Samyuktha (@iamsamyuktha_) February 10, 2024

స్వయంభు చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్‌ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్‌, శ్రీకర్ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌. స్వయంభు చిత్రానికి కేజీఎఫ్‌ ఫేం రవి బస్రూర్ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్‌ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నాడు.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.