Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Sarfaraz | సర్ఫరాజ్‌కు సారీ చెప్పిన జడేజా.. అరంగేట్ర హీరో రియాక్షన్‌ ఏంటంటే..-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 15, 2024No Comments

Jadeja-Sarfaraz | 66 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 62 రన్స్‌ చేసిన సర్ఫరాజ్‌.. తొలి రోజు మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయ్యాడు.

February 15, 2024 / 08:59 PM IST
Jadeja-Sarfaraz | సర్ఫరాజ్‌కు సారీ చెప్పిన జడేజా..  అరంగేట్ర హీరో రియాక్షన్‌ ఏంటంటే..

Jadeja-Sarfaraz | భారత క్రికెట్‌ జట్టులోకి రావాలని సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తుది జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్‌.. ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే అంచనాలకు మించి రాణించాడు. 66 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 62 రన్స్‌ చేసిన సర్ఫరాజ్‌.. తొలి రోజు మరికొద్దిసేపట్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా రవీంద్ర జడేజాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌ అయ్యాడు. సర్ఫరాజ్‌ను రనౌట్‌ చేసినందుకు పలువురు అభిమానులు జడేజాపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో జడ్డూ తొలిరోజు ఆట ముగిశాక స్పందించాడు. సర్ఫరాజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.

మొదటి రోజు ఆట ముగిశాక జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ.. ‘సర్ఫరాజ్‌ కోసం బాధగా ఉంది. అలా పిలవడం నా తప్పే.. కానీ చాలా బాగా ఆడావ్‌..’ అని స్టేటస్‌లో రాసుకొచ్చాడు. జడేజా 99 పరుగుల వద్ద పరుగు తీయబోగా సర్ఫరాజ్‌ రనౌట్‌ అయ్యాడు. సర్ఫరాజ్‌ క్రీజులోకి వచ్చేదాకా నెమ్మదిగా సాగిన భారత స్కోరుబోర్డు వేగాన్ని అతడు వచ్చాక రాకెట్‌ స్పీడ్‌తో పరుగెత్తించాడు. 48 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న ఈ ముంబై కుర్రాడు.. రనౌట్‌ అవగానే డ్రెస్సింగ్‌ రూమ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా కోపంతో తన తల మీద ఉన్న క్యాప్‌ను నేలకేసి కొట్టాడు.

 

Ravindra Jadeja’s Instagram story for Sarfaraz Khan.

– He said “Feeling sad for Sarfaraz, it was my wrong call. Well played”. pic.twitter.com/6uN8fTbBPc

— CricketMAN2 (@ImTanujSingh) February 15, 2024

కాగా రనౌట్‌పై సర్ఫరాజ్‌ కూడా స్పందించాడు. తొలి రోజు ఆట ముగిశాక మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్‌.. ఇవన్నీ ఆటలో భాగమేనన్నాడు. ‘ఇవన్నీ ఆటలో కామన్‌. క్రికెట్‌లో మిస్‌ కమ్యూనికేషన్స్‌ తరుచూ జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు రనౌట్స్‌ అవుతాయి. కొన్నిసార్లు మనం పరుగులు సాధిస్తాం..’ అని అన్నాడు. జడేజా వల్ల తాను రనౌట్‌ అయినా దానికి తనకేం బాధ లేదని చెప్పిన సర్ఫరాజ్‌.. అతడి వల్లే తాను స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలిగానని చెప్పుకొచ్చాడు. ‘నేను లంచ్‌ సమయంలోనే జడేజా భయ్యాతో మాట్లాడా. నేను క్రీజులోకి వస్తే తనతో కూడా మాట్లాడాలని కోరా. నాకు నేను బ్యాటింగ్‌ చేసేప్పుడు మాట్లాడుతూ ఆడటం అలవాటు. ఇదే నా ఫస్ట్‌ గేమ్‌. జడ్డూ భయ్యా నాకు చాలా బాగా సపోర్ట్‌ చేశాడు..’అని అన్నాడు.

 

Sarfaraz Khan said “I told Jaddu Bhai to keep talking to me while I bat as I like talking while batting – he supported me a lot today”. [Sahil Malhotra from News18] pic.twitter.com/zgejEDPDRh

— Johns. (@CricCrazyJohns) February 15, 2024

ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌.. 86 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (110 బ్యాటింగ్‌), కుల్‌దీప్‌ యాదవ్‌ (1 బ్యాటింగ్‌)లు క్రీజులో ఉన్నారు.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.