Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) రెండో పెండ్డి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అతడు పాక్‌కు చెందిన నటి సనా జావెద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను…
Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) రెండో పెండ్డి చేసుకున్నాడు. కొన్నాళ్లుగా భార్య సానియా మిర్జా(Sania Mirza)కు దూరంగా ఉంటున్న అతడు.. పాక్‌కు చెందిన నటి సనా జావెద్(Sana Javed)ను వివాహం చేసుకున్నాడు. తమ పెండ్లి వేడుక ఫొటోలను షోయబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఆ ఫొటోలకు ‘అహ్మదుల్లా.. మేము ఒక్కటయ్యాం’ అని క్యాప్షన్ రాశాడు. దాంతో, భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియాకు మాలిక్ విడాకులు ఇచ్చాడా? లేదా? అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
– Alhamdullilah ♥️
“And We created you in pairs” وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024
షోయెబ్ మాలిక్, సానియా మిర్జా వివాహం 2010లో దుబాయ్‌లో ఘనంగా జరిగింది. వీళ్లకు ఇజాన్(Izaan) అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, గత కొంత కాలంగా సానియా, షోయబ్ వేరువేరుగా ఉంటున్నారు. దాంతో, వీళ్ల పన్నెండేళ్ల వివాహబంధం త్వరలోనే ముగియనుందనే వార్తలు వినిపించాయి. అయితే.. అధికారికంగా మాలిక్, సానియాలు ఎక్కడా తాము విడిపోతున్నామని వెల్లడించలేదు. అంతేకాదు.. వీళ్లిద్దరూ ది మీర్జా మాలిక్ షో లో కలిసి నటించారు.
షోయబ్ మాలిక్, సనా జావెద్, సానియా మిర్జా

సానియాతో విడాకుల ప్రస్తావన వచ్చిన సమయంలోనే పాక్‌కు చెందిన యూట్యూబర్, నటి అయేషా ఒమర్(Ayesha Omar)తో షోయబ్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. అందుకనే ఈ మాజీ ఆల్‌రౌండర్ సానియాతో డైవర్స్‌కు సిద్ధపడ్డాడనే గుసగుసలు వినిపించాయి. కానీ, అయేషా మాత్రం ఆ వార్తల్ని కొట్టిపారేసింది. తనకు షోయబ్ మంచి మిత్రుడని, అతను తన భార్య సానియాతో సంతోషంగా ఉన్నాడని ఆమె చెప్పింది.
