Sindhu – Prannoy : భారత స్టార్ షట్లర్లకు మరో షాక్ తగిలింది. ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్ (Badminton Asian Championships 2024)లో పతకంపై ఆశలు రేపిన పీవీ సింధు(PV Sindhu), హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy)ల పోరాటం ముగిసింది.

Sindhu – Prannoy : భారత స్టార్ షట్లర్లకు మరో షాక్ తగిలింది. ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్ (Badminton Asian Championships 2024)లో పతకంపై ఆశలు రేపిన పీవీ సింధు(PV Sindhu), హెచ్‌హెస్ ప్రణయ్(HS Prannoy)ల పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌లోనే ఇద్దరూ వెనుదిరిగారు. దాంతో, టైటిల్‌పై ఉన్న కాస్త ఆశలు ఆవిరయ్యాయి. గురువారం ఆరోసీడ్ హన్ యూ చేతిలో సింధు కంగుతినగా.. లీ చున్ యీ ధాటికి ప్రణయ్ నిలబడలేకపోయాడు.
తొలి రౌండ్‌లో అద్భుత పోరాటపటిమతో గెలుపొందిన సింధు.. రెండో రౌండ్‌లో తేలిపోయింది. చైనాకు చెందిన హన్ లీ విజృంభించగా 18-21, 21-13, 17-21తో సింధు ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కీలక పోరులో తడబడ్డాడు.
A battle hard-fought for an hour and 9 minutes but, it wasn’t to be for Sindhu this time.
📸: @badmintonphoto#BAC2024 #IndiaontheRise#Badminton pic.twitter.com/9rvXYUYg1q
— BAI Media (@BAI_Media) April 11, 2024
లిన్ చున్ రాకెట్ వేగానికి బదులివ్వలేక 18-21, 11-21తో మ్యాచ్ చేజార్చుకున్నాడు. ఇక డబుల్స్‌లోనూ అశ్విని పొన్నప్ప, తనీశ క్రాస్టో జోడీ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మూడో సీడ్ నమీ మస్త్యుమ్య, చిహరు షిదా జంట చెలరేగడంతో అశ్విని, తనీశ చేతులెత్తేశారు. రెండు సెట్లలో కనీస పోటీ ఇవ్వని భారత జోడీ 21-17, 21-12తో చిత్తుగా ఓడిపోయింది.