Sonia Gandhi | ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీపడనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయ్యింది.
Sonia Gandhi: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీపడనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయ్యింది.
ఇదిలావుంటే సోనియా కుమార్తె, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
