Sridevi Biopic | తాను బతికి ఉన్నంత వరకు తన భార్య, దివంగత శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఒప్పుకోనని అగ్ర నిర్మాత బోనీకపూర్ అన్నారు. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘మైదాన్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Sridevi Biopic | తాను బతికి ఉన్నంత వరకు తన భార్య, దివంగత శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించడానికి ఒప్పుకోనని అగ్ర నిర్మాత బోనీకపూర్ అన్నారు. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘మైదాన్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నా భార్య వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యతనిచ్చేది.
తన పర్సనల్ విషయాలు బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదని అనుకునేది. ఆమె వ్యక్తిత్వాన్ని నేను ఎంతగానో గౌరవిస్తాను. బయోపిక్ సినిమా అంటే నిజాలను వక్రీకరించే అవకాశం ఉంటుంది. అందుకే నా భార్య కోరిక ప్రకారం ఆమె బయోపిక్‌ను తీయడానికి ఒప్పుకోను. నేను బతికి వున్నంత వరకు శ్రీదేవి బయోపిక్‌ను ఎవరూ తీయలేరు’ అని చెప్పారు బోనీకపూర్. ఆరేళ్ల క్రితం దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది అందాల తార శ్రీదేవి. గత కొంతకాలంగా బాలీవుడ్లో ఆమె బయోపిక్ తీసేందుకు పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో బోనీకపూర్ తాజా వ్యాఖ్యాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
