Sydney Killer | ఆస్ట్రేలియాలోని సిడ్నీ మాల్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిపి, ఐదుగురిని కాల్చిచంపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. బోండీ శివార్లలో బీచ్ దగ్గర ఆ హంతకుడిని కాల్చివేశారు. హంతకుడు వచ్చి రావడంతోనే కాల్పులు జరిపి, అనంతరం కత్తితో దొరికినవాళ్లను దొరికినట్టు పొడిచాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Sydney Killer : ఆస్ట్రేలియాలోని సిడ్నీ మాల్‌లో ఒక్కసారిగా కాల్పులు జరిపి, ఐదుగురిని కాల్చిచంపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. బోండీ శివార్లలో బీచ్ దగ్గర ఆ హంతకుడిని కాల్చివేశారు. హంతకుడు వచ్చి రావడంతోనే కాల్పులు జరిపి, అనంతరం కత్తితో దొరికినవాళ్లను దొరికినట్టు పొడిచాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడు ఎందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడో తెలియాల్సి ఉందని చెప్పారు.
కాగా, హంతకుడి దాడిలో ఐదుగురు ప్రాణాలో కోల్పోయారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు. వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సిడ్నీలోని బోండీ జంక్షన్ వెస్ట్‌ఫీల్డ్‌లో ఇవాళ ఉదయం ఈ దారుణం జరిగింది. మాల్‌లో ఒక్కసారిగా కాల్పులు, కత్తిపోట్లు చోటుచేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. గుంపులు గుంపులుగా బయటికి వచ్చిన చుట్టుపక్కల వీధుల్లోకి పరుగందుకున్నారు.