Tej Pratap Yadav | బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు.
పాట్నా: బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్‌లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఎక్కువగా ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే తేజ్ ప్రతాప్ యాదవ్, గురువారం బక్సర్ ప్రాంతంలో పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించారు. మహాఘటబంధన్ ప్రభుత్వంలో పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. అలాగే మరో టర్మ్‌లో ఆరోగ్య శాఖ ఫోర్ట్‌పోలియో నిర్వహించారు.
