కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పునఃప్రారంభించారు.
హనుమకొండ: కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పునఃప్రారంభించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పునఃనిర్మించిన కల్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి ఆరంభించారు. అనంతరం యాగశాలలో శాంతి హోమ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వేయి స్తంభాల గుడి కట్టేందుకు 72 ఏండ్ల పట్టిందన్నారు. మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. పునఃనిర్మాణం చేసిన కల్యాణమండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. దీనివల్లే సంపూర్ణమైన వేయి స్తంభాల దేవాలయం పూర్తయిందని వెల్లడించారు. 2005లో కేంద్ర పురావస్తుశాఖ కల్యాణ మండప పునర్నిర్మాణ మహాఘట్టానికి శ్రీకారం చుట్టింది. పునరుద్ధరణకు మొత్తం రూ.15 కోట్లు వెచ్చించి పనులు పూర్తిచేసిన విషయం తెలిసిందే.
ఓరుగల్లు నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో ఒకటో రుద్రుడు కీ.శ.1163లో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1,400 మీటర్ల వైశాల్యంలో, శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించారు. శిలలపై సప్తస్వరాలు లిఖించడంతో పాటు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయపాడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం వెయ్యి స్తంభాలతో వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు.
#WATCH | Telangana: Union Minister and Telangana BJP President G Kishan Reddy offer prayers at Thousand Pillar Temple in Hanumakonda, on the occasion of #Mahashivratri pic.twitter.com/aJYx0JKBcl
— ANI (@ANI) March 8, 2024
