Tillu Square Movie | స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ (Tillu Square). డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ విడుదలైన మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.100కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
Tillu Square Movie | స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ (Tillu Square). డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ విడుదలైన మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.100కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి టాక్ బాగుండడంతో ప్రేక్షకులు ఎగబడి మరి ఈ సినిమాకు వెళుతున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి చిత్రయూనిట్ క్రేజీ అప్‌డేట్ పంచుకుంది.
ఈ మూవీ నుంచి తాజాగా టికెటే కొనకుండా (Ticket Eh Konakunda) సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. రాధికతో పంచాయితీ ముగిశాక లిల్లీ(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు టిల్లు. ఈ నేపథ్యంలోనే పాట సాగుతుంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. రామ్ మిరియాల పాడడంతో పాటు సంగీతం అందించాడు.
మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటించిన ఈ చిత్రంను మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రిన్స్, మురళిధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.