Toyota Innova Hycross | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన ఇన్నోవా హైక్రాస్ మోడల్ కారు న్యూ పెట్రోల్ వేరియంట్ జీఎక్స్ (ఓ)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

Toyota Innova Hycross | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన ఇన్నోవా హైక్రాస్ మోడల్ కారు న్యూ పెట్రోల్ వేరియంట్ జీఎక్స్ (ఓ)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 8- సీటర్ ఇన్నోవా హై క్రాస్ కారు ధర రూ.20.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), సెవెన్ సీటర్ వేరియంట్ రూ.21.13 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జీఎక్స్ ట్రిమ్ మోడల్ కారు సాయంతో రూపుదిద్దుకున్న జీఎక్స్ (ఓ) వేరియంట్ 10.1 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, రేర్ సన్ షేడ్, రేర్ డీఫాగర్, డ్యుయల్ టోన్ ఇంటీరియర్ విత్ సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు అప్ గ్రేడ్ చేశారు.
డార్క్ చెస్ట్ నట్ క్విల్టెడ్ లెదర్ సీట్స్, సాఫ్ట్ టచ్ లెదర్, మెటాలిక్ డెకోరేసన్స్ తోపాటు ఎక్స్ టీరియర్‌గా 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ ఎండ్ స్పాయిల్ విత్ ఎల్ఈడీ స్టాప్ లాంప్, ఓఆర్వీఎంస్ విత్ ఆటో ఫోల్డ్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, టర్న్ ఇండికేటర్లు జత చేశారు. సేఫ్టీ కోసం ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, సిక్స్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ యాంకర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
టయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ (ఓ) కారు 2.0 లీటర్ల టీఎన్జీఏ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 172 బీహెచ్పీ విద్యుత్, 205 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. డైరెక్ట్ షిఫ్ట్ సీవీటీ విత్ లాంచ్ గేర్ మెకానిజం, 10-స్పీడ్ సీక్వెన్సియల్ షిప్ట్ తదిరత ఫీచర్లు జత చేశారు. లీటర్ పెట్రోల్ పై 16.13 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 2022 నవంబర్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి 50 వేలకు పైగా యూనిట్లు విక్రయించింది. ఇటీవలే టాప్ హైబ్రీడ్ మోడల్స్ జడ్ఎక్స్, జడ్ఎక్స్ (ఓ) కార్ల కోసం బుకింగ్స్ ప్రారంభించింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ పేరియంట్ రూ.30.98 లక్షలకు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల ప్రారంభం నుంచి అన్ని కార్లపై ఒక శాతం ధరలను టయోటా పెంచేసింది.