రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలున్నాయని చెప్పారు. వివరణల ప్రకారం, ఆదివారం నుండి సోమవారం వరకు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.

