Uber Taxi | బెంగళూరులో ఓ మహిళ మరిచిపోలేని అనుభవం ఎదురైంది. విమానాశ్రయం నుంచి ఇంటికి ఉబర్ ట్యాక్సీ బుక్ చేస్తే రూ.2వేలపైగా బిల్ వచ్చింది. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
UBER Taxi | బెంగళూరులో ఓ మహిళ మరిచిపోలేని అనుభవం ఎదురైంది. విమానాశ్రయం నుంచి ఇంటికి ఉబర్ ట్యాక్సీ బుక్ చేస్తే రూ.2వేలపైగా బిల్ వచ్చింది. దీంతో ఆ మహిళ షాక్‌కు గురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మానుషి శర్మ అనే మహిళ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వివరాల ప్రకారం.. ఆమె మహారాష్ట్రలోని పుణే విమానాశ్రయం నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. విమానం టికెట్‌ను రూ.3500 కొనుగోలు చేసినట్లు తెలిపారు. బెంగళూరు నుంచి ఇంటికి వెళ్లేందుకు విమానాశ్రయం నుంచి క్యాబ్ బుక్ చేస్తే రూ.2వేలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కేవలం 3.5 కిలోమీటర్ల దూరానికే రూ.2,005 ఛార్జీలు వసూలు చేసినట్లు పేర్కొంటూ ఉబర్ ఇండియాను సైతం ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు మిలియన్ మంది వరకు వీక్షించగా.. 7వేల వరకు లైక్స్ వచ్చాయి. ఈ పోస్టును చూసిన పలువురు నెటిజన్లు స్పందించారు. ఓ యూజర్ స్పందిస్తూ ఉబర్ డ్రైవర్లు చాలా మంది ఏసీని ఆన్ చేయరని.. కేవలం ప్రీమియర్‌లో మాత్రమే ఏసీ పని చేస్తుందని పేర్కొన్నాడు. వీలైతే బస్సులను ఉపయోగించుకోవాలని మరో నెటిజన్ సూచించాడు. బెంగళూరు విమానాశ్రయం నుంచి నగరంలోకి వెళ్లడం కంటే.. పుణే విమానాశ్రయం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకునేందుకు తక్కువ సమయం పడుతుంది అని మరో యూజర్ పేర్కొన్నాడు.
వీలైనంత వరకు బస్సుల్లో ప్రయాణం చేయాలని.. లేకపోతే ఎయిర్‌పోర్ట్ పికప్.. డ్రాప్‌ఆఫ్ కోసం ఎవరైనా నమ్మకమైన డ్రైవర్ల తెలిస్తే వెళ్లాలని.. వారైతే రూ.2వేల కంటే తక్కువ తీసుకుంటారని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఉబర్ ట్యాక్సీ ఛార్జీలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్ట్ నుంచి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి పదికిలోమీటర్లకు రూ.207 మాత్రమే చూపించగా.. గమ్యస్థానానికి వెళ్లాక బిల్లు రూ.కోటిపైగా చూపింది. దాంతో సదరు ప్రయాణికుడు షాక్ అయ్యాడు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్ నోయిడాలోనూ ఓ ప్రయాణికుడు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే, ఇప్పటి వరకు ఉబర్ దీనిపై స్పందించలేదు.
I booked flight for 3.5k from Pune to Bangalore.
And then, a cab for 2k from Bangalore airport to my home💀@Uber_India pic.twitter.com/wZyzOpOvHF— Manasvi Sharma (@manasvisharmaaa) April 1, 2024
