Uddhav Vs Shinde | మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలినా.. కొంత ఉపశమనం కలిగించింది.
Uddhav Vs Shinde | మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలినా.. కొంత ఉపశమనం కలిగించింది. వాస్తవానికి రెండు పార్టీలు అసెంబ్లీ స్పీకర్ ఎదుట 34 అనర్హత పిటిషన్లు వేశాయి. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రస్తావిస్తూ తమదే నిజమైన పార్టీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. మరో వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శివసేన ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయకపోవడంతో సభ్యత్వాన్ని నిలుపుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లు తిరస్కరించినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు.
అయితే, షిండే గ్రూప్‌నే రియల్ శివసేనగా గుర్తిస్తూ.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. జూన్ 21న జరగనున్న ఎస్ఎస్ఎల్పీ సమావేశానికి గైర్హాజరైనందున ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని.. ఎన్నికల సంఘం షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా భావించిందని, ఆ సమయంలో భరత్ గోగావాలేను నియమించారని స్పీకర్ పేర్కొన్నారు. చీఫ్‌విప్ కాబట్టి సునీల్ ప్రభుకు శాసనసభా పక్ష సమావేశాన్ని పిలిచే హక్కులేదన్నారు. దీని ఆధారంగా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించలేమన్నారు. శివసేన చీలిక తర్వాత రెండువర్గాలు ఒక వర్గంపై మరొక వర్గం అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు.. షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇందులో సీఎం ఏక్నాథ్ షిండే సైతం ఉన్నారు.
ఇటీవల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. ఈ మేరకు రాహుల్ నర్వేకర్ నిర్ణయాన్ని వెలువరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహా ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లను త్వరగా జాబితా చేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు కోరింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు టైమ్‌టేబుల్‌ను ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం సభా కార్యక్రమాలను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేయలేరని కోర్టు పేర్కొంది. కోర్టు సూచనలపై గౌరవ భావన ఉండాలన్న కోర్టు.. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ మే 11 కోర్టు తీర్పు తర్వాత స్పీకర్ ఏం చేశారో చెప్పాలని కోర్టు అడిగింది.