Ugadi festival | ఉగాది అనగానే మామిడి ఆకుల తోరణాలు, బంతిపూలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం సరేసరి.

వసంత శోభితాన్ని పులుముకున్న ప్రకృతమ్మ కొంగొత్త సింగారాలు పోయే వేళ.. లేలేత చివుళ్లు మేసి, కంఠాన్ని సవరించుకున్న కోయిలమ్మ గ‘మ్మత్తు’గా కూసే వేళ.. కష్ట సుఖాల కలబోతగా గడిచిన శోభకృతు నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, క్రోధి నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న వేడుకే నేటి ఉగాది(Ugadi festival).
ఉగాది అనగానే మామిడి ఆకుల తోరణాలు, బంతిపూలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం సరేసరి. మంగళవారం పండుగ సందర్భంగా కరీంనగర్(Karimnagar) నగర శివారులోని మామిడితోటలో యువతులు సందడి చేశారు. ఉగాది పచ్చడి కోసం మామిడి కాయలు కోస్తూ కనిపించగా, ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది.
– కరీంనగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్

Ugadi