ICC Under 19 World Cup 2024: ఫైనల్లో ఓడటం నిరాశే అయినప్పటికీ ఈ బాధ మాత్రం భారత అభిమానులకు కొత్తేం కాదు. గడిచిన పదకొండేండ్లుగా సీనియర్ స్థాయిలో మన పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇస్తున్న షాకులతో పోల్చితే ఇదేం పెద్దది కాదు.
ICC Under 19 World Cup 2024: సౌతాఫ్రికా వేదికగా కొద్దిసేపటి క్రితమే ముగిసిన ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఫైనల్లో ఓడటం నిరాశే అయినప్పటికీ ఈ బాధ మాత్రం భారత అభిమానులకు కొత్తేం కాదు. గడిచిన పదకొండేండ్లుగా సీనియర్ స్థాయిలో మన పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఇస్తున్న షాకులతో పోల్చితే ఇదేం పెద్దది కాదు. వాస్తవానికి సీనియర్ లెవల్‌తో పోలిస్తే జూనియర్ స్థాయిలోనే గడిచిన దశాబ్దకాలంగా భారత్ ఘన విజయాలతో పాటు ఐసీసీ ట్రోఫీలను సాధిస్తోంది. 2018, 2020లలో ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్స్ గెలిచిన భారత్.. గతేడాది తొలిసారిగా ఆడిన ఐసీసీ అండర్ – 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో ఆది నుంచి అదరగొట్టిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది.
2013 నుంచి ఇదే కథ..
అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు ఐసీసీ ట్రోఫీలలో వైఫల్యం ఇప్పటిది కాదు. అప్పుడెప్పుడో 2013లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు.. ఇంగ్లండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక సీనియర్ లెవల్లో భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లలో సెమీఫైనల్స్‌లో ఓడిన భారత్.. 2023లో ఆస్ట్రేలియా చేతిలోనే ఫైనల్లో ఓడింది. 2019లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో భారత్‌కు పరాభవం తప్పలేదు.
Literally me. #INDvAUS pic.twitter.com/TsM0BukZGf
— Prayag (@theprayagtiwari) February 11, 2024
Losing to Australia in a World Cup Final. #INDvAUS pic.twitter.com/rw2XcmTUdS
— Sagar (@sagarcasm) February 11, 2024
టీ20 టోర్నీలలో 2016లో సెమీస్ చేరిన భారత్ 2021లో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. 2022లో సెమీస్ చేరినా ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్.. తొలిసారి న్యూజిలాండ్, గతేడాది ఆసీస్‌లకు ట్రోఫీని అప్పగించింది.
Once again 😢#INDvAUS #U19WorldCup2024 pic.twitter.com/UOvnqXAFJ6
— Sagar (@sagarcasm) February 11, 2024
Indian Cricket team in every ICC tournament since 2014 😢#INDvAUSpic.twitter.com/oXcGziRruO
— Ashish 𝕏|…. (@Ashishtoots) February 11, 2024
పురుషుల క్రికెట్లో కథ ఇలా ఉంటే మహిళల క్రికెట్లోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2020 ఎడిషన్ (టీ20 వరల్డ్ కప్)లో ఫైనల్ చేరిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఆసీస్ చేతిలోనే ఓడింది. 2018, 2023లలో సెమీఫైనల్స్కే పరిమితమైంది. ఇక 2017 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినా ఇంగ్లండ్ చేతిలో ఓటమి తప్పలేదు. తాజాగా కుర్రాళ్లు కూడా అండర్ – 19 మెన్స్ వరల్డ్ కప్‌లో ఆసీస్‌కే దాసోహమయ్యారు.
