వంట చేయడం ఆలస్యమైందని భార్యను చంపాడో వ్యక్తి. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) సీతాపూర్ జిల్లాలో జరిగింది.
లక్నో: వంట చేయడం ఆలస్యమైందని భార్యను చంపాడో వ్యక్తి. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) సీతాపూర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని కొత్వాలన్పుర్వాకు చెందిన ప్రేమాదేవి ప్రేమాదేవి (28), పరశురాం(30) భార్యాభర్తలు. సోమవారం పనుల నిమిత్తం బయటకెళ్లిన పరశురాం ఇంటికి వచ్చి భోజనం పెట్టాలని భార్యను అడిగాడు.
అయితే వంట ఇంకా సిద్ధం కాలేదని ఆమె అనడంతో.. ఆగ్రహానికి లోనై భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో పదునైన ఆయుధంతో ఆమెపై పలుమార్లు దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే విజయం బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లో గడియపెట్టుకొని తానూ ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
