Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Vande Bharat | సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య ప‌ట్టాలెక్కిన మ‌రో వందేభార‌త్.. ప్రారంభించిన మోదీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 12, 2024No Comments

Vande Bharat | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సార‌థ్యంలో మ‌రో రెండు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప‌ట్టాలెక్కాయి. సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య ఇప్ప‌టికే వందే భార‌త్ రైలు న‌డుస్తుండ‌గా, నేటి నుంచి మ‌రొక‌టి అందుబాటులోకి వ‌చ్చింది.

March 12, 2024 / 10:29 AM IST
Vande Bharat | సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య ప‌ట్టాలెక్కిన మ‌రో వందేభార‌త్.. ప్రారంభించిన మోదీ

Vande Bharat | న్యూఢిల్లీ : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సార‌థ్యంలో మ‌రో రెండు వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప‌ట్టాలెక్కాయి. సికింద్రాబాద్ – విశాఖ మ‌ధ్య ఇప్ప‌టికే వందే భార‌త్ రైలు న‌డుస్తుండ‌గా, నేటి నుంచి మ‌రొక‌టి అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో పాటు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కొన్ని స్టేష‌న్ల‌ను క‌లుపుతూ క‌ల‌బుర‌గి – బెంగ‌ళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం ఉద‌యం ప‌చ్చ‌జెండా ఊపి ప్రారంభించారు. వీటితో పాటు మొత్తం 10 వందే భార‌త్ రైళ్ల‌ను అహ్మ‌దాబాద్ నుంచి ప్ర‌ధాని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.

సికింద్రాబాద్ – విశాఖ‌, క‌ల‌బురగి – బెంగ‌ళూరు, ల‌క్నో – డెహ్రాడూన్, పాట్నా – ల‌క్నో, న్యూ జ‌ల్‌పాయ్ గుడి – పాట్నా, పూరి – విశాఖ‌ప‌ట్నం, రాంచీ – వార‌ణాసి, ఖ‌జుర‌హో – ఢిల్లీ, అహ్మ‌దాబాద్ – ముంబై, మైసూర్ – చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్ల‌ను మోదీ ప్రారంభించారు. మొత్తంగా వందే భార‌త్ రైళ్ల సంఖ్య 51కి చేరింది. ఇవి 45 మార్గాల్లో ప‌రుగులు తీస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల‌కు మోదీ శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. వీటిలో కొన్నింటిని జాతికి అంకితం చేశారు. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌రిధిలో 9 పీఎం గ‌తిశ‌క్తి కార్గో టెర్మిన‌ళ్లు, 11 గూడ్స్ షెడ్లు, రెండు జ‌న ఔష‌ధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్ల‌ను మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కొళ్లం – తిరుప‌తి మెయిల్ ఎక్స్‌ప్రెస్, ప‌లు మార్గాల్లో రెండో లైను, మూడో లైను, గేజ్ మార్పిడి, బైపాస్ లైన్ల‌ను ప్రారంభించారు.

#WATCH | Gujarat | Prime Minister Narendra Modi flags off 10 new Vande Bharat trains and other train services, from Ahmedabad. pic.twitter.com/3Z0uaFrb4l

— ANI (@ANI) March 12, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.