Viral Video : ఇంటర్‌నెట్‌లో చిత్రవిచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ నెటిజన్లకు చిరాకు తెప్పిస్తుంటాయి. కొన్ని ఫుడ్ కాంబోలపై యూజర్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు.
Viral Video : ఇంటర్‌నెట్‌లో చిత్రవిచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ నెటిజన్లకు చిరాకు తెప్పిస్తుంటాయి. కొన్ని ఫుడ్ కాంబోలపై యూజర్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతుంటారు. మనం ఊహించని స్నాక్స్, వెరైటీ ఫుడ్ కాంబోలతో కూడిన వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. ఇక కాజు కట్లీ బజ్జీలంటూ మరో వైరల్ వీడియో ఇంటర్‌నెట్‌లో సందడి చేస్తోంది.
ఈ వీడియోలో ఓ మహిళ కాజు కట్లీ బజ్జీలను తయారుచేయడం కనిపిస్ఉతంది. ఎంఫ్యూచర్‌వాలా అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో మహిళ శనగపిండితో చేసిన పేస్ట్‌తో నిల్చుని ఉండటం చూడొచ్చు. ఆపై ఓ బాక్స్‌లో ఉన్న కాజు కట్లీలను తీసుకుని సిద్ధం చేసిన పిండిలో ముంచి నూనెలో వేయించడం కనిపిస్తుంది.
Anyone for Kaju Katli Bhajiyas??? pic.twitter.com/hl1dr5PDfX
— Mohammed Futurewala (@MFuturewala) March 6, 2024
కాజు కట్లీ బజ్జీల కోసం ఎవరైనా అని ఈ క్లిప్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై కామెంట్స్ సెక్షన్‌లో పలువురు నెటిజన్లు రియాక్టయ్యారు. టేస్టీ కట్లీని ఎలా వేస్ట్ చేశారని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :
వంట గ్యాస్ ధర తగ్గింపు రాజకీయ ఎత్తుగడ : మోదీ సర్కార్‌పై భగ్గుమన్న విపక్షం
