Virat Kohli-Anushka Sharma | విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
Virat Kohli-Anushka Sharma |విరుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. బుల్లి కోహ్లీకి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్టు ప్రకటనలో తెలిపింది. అనుష్క శర్మ పెట్టిన పోస్టుతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి తప్పుకున్న కోహ్లీకి ఏమైంది..? అసలెందుకు అతడు ఆడటం లేదు..? కోహ్లీ తల్లికి బాగోలేదా..? వాళ్ల ఇంట్లో అంతా ఓకేనా..? వంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది.
