Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

WPL 2024 | ఢిల్లీతో కీలక మ్యాచ్‌.. యూపీకి ఆఖరి మోక.. ఓడితే అంతే సంగతులు!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 8, 2024No Comments

WPL 2024, DC vs UP | ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్‌ నేడు అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే యూపీ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్నట్టే..!

March 8, 2024 / 07:02 PM IST
WPL 2024 | ఢిల్లీతో కీలక మ్యాచ్‌.. యూపీకి ఆఖరి మోక.. ఓడితే అంతే సంగతులు!

WPL 2024, DC vs UP | మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) రెండో సీజన్‌లో గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ముగింపునకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 14 మ్యాచ్‌లు ముగిసిన లీగ్‌ దశలో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న యూపీ వారియర్స్‌ నేడు అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే యూపీ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్నట్టే. ఢిల్లీ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో బెర్త్‌ దక్కించుకున్న తొలి టీమ్‌ అవనుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక పోరులో యూపీ సారథి అలిస్సా హీలి టాస్‌ గెలిచి ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

ఈ సీజన్‌లో యూపీ.. ముంబై, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో మాత్రమే నెగ్గి మిగిలిన నాలుగింట్లోనూ ఓడింది. గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యూపీకి ఇది ఏడో మ్యాచ్‌ కాగా ఈనెల 11న గుజరాత్‌ జెయింట్స్‌తో పోటీ పడనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న యూపీ.. ప్లేఆఫ్స్‌ చేరాలంటే నేడు ఢిల్లీని భారీ తేడాతో ఓడిస్తే ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు చేరతాయి. గుజరాత్‌ను కూడా ఓడించాలి.

వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచినా యూపీకి ప్లేఆఫ్స్‌ అంత వీజీ అయితే కాదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. యూపీకి ఆ జట్టు విజయాలతో పాటు ఆర్సీబీ పరాజయాలే ప్లేఆఫ్స్‌ దశను నిర్దేశిస్తాయి. గత సీజన్‌లో ఇలాగే ఆటుపోట్ల మధ్య ప్లేఆఫ్స్‌ చేరిన యూపీ.. ఈ సీజన్‌లో అలాంటి మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తుందేమో చూడాలి.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.