WPL 2024, UP vs MI | డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తిరిగి విజయాల బాట పట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో గురువారం ముగిసిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై.. 42 పరుగుల తేడాతో గెలిచింది.
WPL 2024, UP vs MI | గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ తిరిగి విజయాల బాట పట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో గురువారం ముగిసిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై.. 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి ముంబై నిర్దేశించిన 161 పరుగుల ఛేదనలో యూపీ.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమైంది. ముంబై ఏకంగా 8 మంది బౌలర్లను ఉపయోగించగా అందులో ఆరుగురు వికెట్లు తీయడం విశేషం. ఇందులో స్పిన్నర్ సైకా ఇషాక్ (3), మాథ్యూస్ (1), సజన (1)లు యూపీని కట్టడి చేశారు. యూపీని ఓడించిన ముంబై.. ఈ సీజన్లో నాలుగో విజయంతో పాటు పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.
161 పరుగుల ఛేదనలో భాగంగా యూపీ వారియర్స్ రెండో ఓవర్ నుంచే వికెట్లను కోల్పోయింది. అప్పట్నుంచి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లను నష్టపోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కిరణ్ నవ్గిరె (7) ను సైకా ఇషాక్ రెండో ఓవర్లోనే బౌల్డ్ చేసింది. వన్ డౌన్లో వచ్చిన చమారి ఆటపట్టు (3)ను హేలీ మాథ్యూస్ ఔట్ చేయగా కెప్టెన్ అలిస్సా హీలి (3)ని షబ్నిమ్ ఇస్మాయిల్ బౌల్డ్ చేయడంతో యూపీ 15 పరుగులకే టాప్ – 3 వికెట్లను కోల్పోయింది.
14 బంతులకు ఖాతా తెరిచిన గ్రేస్ హరీస్.. 23 బంతుల్లో 15 పరుగులు చేసి సైకా ఇషాక్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా ఆమె స్థానంలో వచ్చిన శ్వేతా సెహ్రావత్ (17), పూనమ్ ఖేమ్నర్ (7), సోఫి ఎకిల్‌స్టోన్ (0) లు విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (36 బంతుల్లో 53 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో యూపీ.. వంద పరుగుల స్కోరు అయినా చేయగలిగింది.
A convincing 42-run win for Mumbai Indians.
They were brilliant in the bowling department. 🔥#CricketTwitter #WPL2024 #UPWvMI pic.twitter.com/X7DuguexGD
— Female Cricket (@imfemalecricket) March 7, 2024
ఈ విజయంతో ముంబై.. పాయింట్ల పట్టికలో ఆర్సీబీని వెనక్కినెట్టి రెండో స్థానానికి వెళ్లింది. ఆర్సీబీ థర్డ్ ప్లేస్‌లో ఉండగా యూపీ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. ఈ సీజన్లో యూపీ ఆరు ఆడి నాలుగు ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుకోవడం కష్టమే..
