Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

WPL 2024, RCB vs DC | దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ ఎదుట భారీ లక్ష్యం

TelanganapressBy TelanganapressFebruary 29, 2024No Comments

Fotojet (10)

WPL 2024, RCB vs DC | రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఈ సీజన్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భాగంగా మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ దంచికొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు షఫాలీ వర్మ (31 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అలీస్‌ క్యాప్సీ (33 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మరిజన్నె కాప్‌ (16 బంతుల్లో 32, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్‌ జొనాసెన్‌ (16 బంతుల్లో 36 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆర్సీబీ బౌలర్లంతా తేలిపోవడంతో బెంగళూరులో ఆ జట్టు భారీ స్కోరు ఛేదించాల్సి ఉంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈసారి శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 17 బంతులాడి 11 పరుగులే చేసింది. కానీ మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ మాత్రం ఆది నుంచే దూకుడుగా ఆడింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయాంక పాటిల్‌ జారవిడిచింది. దీంతో వచ్చిన అవకాశాన్ని షఫాలీ సద్వినియోగం చేసుకుంది. లానింగ్‌ను డెవిన్‌.. ఔట్‌ చేయడంతో ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది.

షఫాలీ – క్యాప్సీ దూకుడు..

ఐదు ఓవర్లకు 32 పరుగులే చేసిన ఢిల్లీ.. తర్వాత ఆరు ఓవర్లలో 70కి పైగా పరుగులు సాధించింది. మోలినెక్స్‌ వేసిన ఆరో ఓవర్లో షఫాలీ 4, 6 కొట్టగా ఆశా శోభన వేసిన 8వ ఓవర్లో క్యాప్సీ రెండు ఫోర్లు బాదింది. వర్హెమ్‌ వేసిన 10వ ఓవర్లో క్యాప్సీ 6, 4 తో రెచ్చిపోయింది. శ్రేయాంక వేసిన 12వ ఓవర్లో షఫాలీ.. వరుసగా రెండు సిక్సర్లు బాది 30 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకుంది. కానీ అదే ఓవర్లో ఆఖరి బంతికి ఔట్‌ అయింది. దీంతో క్యాప్సీ – షఫాలీ మధ్య 43 బంతుల్లోనే నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే జెమీమా రోడ్రిగ్స్‌ కూడా డకౌట్‌ అయి నిరాశపరిచింది. దూకుడుగా ఆడి అర్థ సెంచరీకి చేరువైన క్యాప్సీ.. క్లర్క్‌ వేసిన 15వ ఓవర్లో ఆఖరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయింది.

 

Innings Break!

Delhi Capitals post a mammoth total of 194/5 🔥🔥

A high-scoring thriller on the cards? 👀

Stay tuned folks!

Scorecard 💻📱https://t.co/mKFymL1O3h#TATAWPL | #RCBvDC pic.twitter.com/d456C6s4SN

— Women’s Premier League (WPL) (@wplt20) February 29, 2024

ఆఖర్లో కాప్‌ – జొనాసెన్‌..

16 ఓవర్లకు 133గా ఉన్న ఢిల్లీ స్కోరు ఆఖర్లో రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. క్లర్క్‌ వేసిన 17వ ఓవర్లో కాప్‌.. మూడు సిక్సరలు బాదింది. ఆ మరుసటి ఓవర్ వేసిన ఆశా శోభన బౌలింగ్‌లో జొనాసెన్‌.. మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టిది. అయితే డెవిన్‌ వేసిన 19వ ఓవర్లో కాప్‌ భారీ షాట్‌ ఆడబోయి సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చింది. శ్రేయాంక వేసిన ఆఖరి ఓవర్లో అరుంధతి రెడ్డి (10 నాటౌట్) ఫోర్‌ కొట్టగా.. జొనాసెన్‌ 4, 6తో ఢిల్లీ స్కోరును 190 మార్కు దాటించింది.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.