YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం ఘటనాస్థలిని పరిశీలించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఉదయం ఘటనాస్థలిని పరిశీలించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. డ్రోన్ల సహాయంతో ఘటనాస్థలిలో ఏరియల్ వ్యూ వీడియోలను చిత్రీకరించారు. ఈ క్రమంలో స్కూల్, టెంపుల్ మధ్య ఓపెన్ ప్లేస్ నుంచి దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలంలో క్లూస్ సేకరించి ఈసీకి సీపీ కాంతిరాణా టాటా నివేదిక సమర్పించారు.
కాగా, దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 20 మంది సిబ్బందితో ఆరు బృందాలను ఏర్పాటు చేసి మరీ నిందితుడి కోసం వెతికిస్తున్నారు. ఘటనాస్థలంలో గత 15 రోజులుగా జరిగిన అనుమానాస్పద కదలికలపైనా పోలీసులు ఫోకస్ చేశారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గంగానమ్మ ఆలయ పరిసరాల్లో కాల్‌డేటాకు సంబంధించిన డంప్‌ను పోలీసులు ఫిల్టర్ చేస్తున్నారు. దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతుండటంతో.. ఎయిర్ గన్ ఉపయోగించారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.