అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ ఏటా ‘చాదర్’ ప్రదర్శనను అందజేశారు. ఈరోజు (బుధవారం) ప్రగతి భవన్లో ముస్లిం మత పెద్దల ఎదుట పవిత్ర ప్రార్థనలు చేసిన అనంతరం అజ్మీర్ దర్గాలో ప్రదర్శించేందుకు చాదర్‌ను వక్ఫ్ బోర్డు అధికారులకు సీఎం కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా… మంత్రి మహ్మద్ అలీ, కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూధనాచారి.. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, గ్యాదరి కిషోర్‌కుమార్, సుధీర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు. .