హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. బహదూర్‌పుర ఎన్‌ఎం గూడలో ఆగి ఉన్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ముందుగా ఓ బస్సులో మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు అంతా వ్యాపించి పక్కనే ఉన్న మరో బస్సుకు అతుక్కుపోయాయి. దీంతో రెండు బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు తెరిచి దర్యాప్తు చేపట్టారు. అయితే బస్సులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం లేదని చెప్పారు.
848068