ఆర్టీసీ బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపుల ధరలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ ప్రైస్ రివిజన్ సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ముగిసిన ఏఎస్ఆర్టీయూ సమావేశం
- 18 రాష్ర్టాల ఆర్టీసీ అధికారుల హాజరు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపుల ధరలను నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో 210వ ప్రైస్ రివిజన్ సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఎస్ఆర్టీయూ స్టాడింగ్ కమిటీ చైర్మన్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్తోపాటు 18 రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలకు చెందిన ఎక్స్పర్ట్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ర్టాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యత గురించి, ఆర్టీసీల పరిరక్షణ కోసం ఏఎస్ఆర్టీయూ కృషి చేస్తుండటం అభినందనీయమని సజ్జనార్ పేర్కొన్నారు. దేశంలో ప్రజా రవాణ వ్యవస్థ వృద్ధి చెందడానికి మంచి అవకాశాలున్నాయని, అందుబాటులో ఉన్న వనరులతో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలని కోరారు. సమావేశంలో ఏఎస్ఆర్టీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యకిరణ్, డైరెక్టర్ ఆర్ఆర్కే కిశోర్, టీఎస్ఆర్టీసీ సీఎంఈ రఘునాథరావు పాల్గొన్నారు.