ఇటలీలో కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది చనిపోయారు. ఇస్కియా దీవికి ఉత్తరాన ఉన్న కాసా మిస్సియోలా దీవిలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో 13 మంది గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీమ్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
గత రెండు రోజులుగా ఇసియా ద్వీపంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఎనిమిది మరణాలను ఇటలీ మంత్రి మాటియో సాల్విని ధృవీకరించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు.
వర్షం కారణంగా, పర్వతం పై నుండి పెద్ద మొత్తంలో బురద క్రిందికి పడిపోయిందని, దిగువ ప్రాంతంలోని అనేక కార్లు మరియు ఇళ్ళు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.
The post ఇటలీలో విషాదం… 8 మంది మృతి, 13 మంది గల్లంతయ్యారు appeared first on T News Telugu.