ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీమోహనరావు (68) ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం తెలిపారు. తన చర్చలు, విశ్లేషణలు, రచనలు సూటిగా ఉండేవని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ప్రజలకు శ్రేయోభిలాషిగా తెలంగాణ వాదాన్ని చాటి చెప్పిన కాలమిస్ట్ ఇలపావులూరి మృతి పట్ల సీఎం సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
షాక్ తిన్న మంత్రులు
తెలంగాణ సాధన కోసం తీవ్రంగా ఉద్యమించిన ఇలపావులూరి మురళీమోహన్ మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సారి జర్నలిజానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. పావులూరి మురళీమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
The post “ఇలపావులూరి” మృతికి సీఎం కేసీఆర్ సంతాపం appeared first on T News Telugu.