ఉత్తరప్రదేశ్లో టీ తాగి ఐదుగురు మృతి చెందారు. మోయిన్పురి జిల్లాలోని నాగ్లా కన్హై గ్రామంలో శివానందన్ (35) తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. నిన్న (గురువారం) శివానందన్ భార్య టీ చేసి అతనికి ఇచ్చింది. కొద్దిసేపటికే టీ తాగిన ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న స్థానికులు ఐదుగురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రవీంద్రసింగ్ (55), శివంగ్ (6), దివాన్ష్ (5) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సోబ్రాన్ (45), శివానందన్ (35)లను మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారంతా ప్రాణాలు కోల్పోయారు. అయితే శివానందన్ భార్య పొరపాటున టీ పొడి అని భావించి వరి పంటకు పిచికారీ చేయాల్సిన మందు కలిపింది. పోలీసుల విచారణలో విషం కలిపినట్లు తేలిందని, ఈ ఘటన జరిగిందని ఎస్పీ కమలేష్ దీక్షిత్ తెలిపారు.