లక్నో: యూపీలోని బదౌన్‌లో ఎలుకలకు రాళ్లు కట్టి నీటిలో ముంచి చంపిన వ్యక్తిపై పోలీసులు వివిధ శాఖల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించిన జంతు హక్కుల కార్యకర్త వికేంద్ర శర్మ నిందితుడు మనోజ్ కుమార్‌పై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఎలుక తోకకు రాయిని కట్టి కాలువలోకి విసిరాడు. జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదు చేయడమే కాకుండా ఎలుకను రక్షించేందుకు రంగంలోకి దిగారు. కాల్వలోంచి బయటకు తీసిన కొద్దిసేపటికే ఎలుక చనిపోయింది.
నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, చనిపోయిన ఎలుకను ఫోరెన్సిక్ పరీక్ష కోసం బదౌన్‌లోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించామని సదర్ కొత్వాలి పోలీస్ ఎస్పీ అలోక్ మిశ్రా తెలిపారు. అక్కడి సిబ్బంది పరీక్షను నిర్వహించడానికి నిరాకరించడంతో, ఎలుకను బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IVRI)కి బదిలీ చేశారు.
860726