కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో చిరుతపులి కలకలం రేపింది. మండలంలోని సోమిరియాగ్డే తండాలో మేకల మందపై చిరుత దాడి చేసింది. గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత మూడు రోజుల్లో మేకల మందపై చిరుత దాడి చేయడం ఇది రెండోసారి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లవద్దని చెబుతున్నారు.
868000