ఒడిశా ఆరోగ్య మంత్రి, అధికార బీజేడీ సీనియర్ నేత నవకిషోర్ దాస్ భువనేశ్వర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆదివారం ఉదయం నవ కిషోర్ దాస్ పై ఏఎస్సై గోపాల్ దాస్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
మరోవైపు మంత్రిపై కాల్పులు జరిపిన ఏఎస్సై గోపాల్‌దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు.
ఆదివారం ఉదయం ఝార్సీగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని గాంధీచౌక్ సమీపంలోని ఓ దేవాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఏఎస్ఐ గోపాల్‌దాస్ మంత్రి నవ కిషోర్‌దాస్‌పై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో మంత్రి నఫ్కిషోర్ దాస్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే పడిపోయారు. తీవ్రంగా గాయపడిన మంత్రిని తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించారు.