అగ్ర నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, దగ్గుతో బుధవారం రాత్రి చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. గురువారం రాత్రి కమల్ హాసన్ పరిస్థితిపై ఆసుపత్రి అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కమల్ హసన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, వెంటనే చికిత్స ప్రారంభించామని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన శరీరం పూర్తిగా కోలుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ తమిళంలో ‘ఇండియన్-2’, ‘బిగ్ బాస్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. బుధవారం హైదరాబాద్‌కు విచ్చేసిన కమల్ హాసన్ తన గురువు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
853644