బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
రాయపోల్, ఏప్రిల్ 3: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి బుధవారం రాయపోల్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రతి ఇంటికీ వస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు
రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగపతిరెడ్డి కుమార్తె సుష్మారెడ్డి, పురుషోత్తంరెడ్డి వివాహానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి, ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేమ శ్రీను, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, తొగుట మండల అధ్యక్షుడు రాంరెడ్డి, చేగుంట మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, దౌల్తాబాద్ మండల సీనియర్ నాయకులు స్టీవాన్రెడ్డి, సత్యనారాయణ, రాజేందర్, రాయపోల్ మండల నాయకులు ఇప్ప దయాకర్, రాజిరెడ్డి, రంగారెడ్డి, భార్గవ్, మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, శ్రీధర్, నవీన్‌గౌడ్, మురళి, మంజూర్, యూసుఫ్, నర్సింగరావు హాజరయ్యారు.