
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య కారక వాహనాలపై తాత్కాలిక నిషేధం అమలులో ఉందన్నారు. బీఎస్-3 పెట్రోల్ కార్లు, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాల నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత పెరుగుతోంది. చలికి తోడు పొగమంచు కమ్ముకుంటుంది.
దీంతో వాయుకాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అదనంగా, ఎన్‌సిఆర్ పరిధిలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు రాష్ట్రాలను కోరుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. పొగమంచు, చల్లని గాలుల కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోందని అధికారులు తెలిపారు. వాయుకాలుష్యం మెరుగుపడితే ముందుగా ఆంక్షలను సడలిస్తామని చెప్పారు.