ఒట్టావా: కెనడాలోని మిస్సిసాగాలో దారుణం. భారత సంతతికి చెందిన పవన్ ప్రీత్ కౌర్ (21) అనే సిక్కు మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ సంఘటన సోమవారం రాత్రి స్థానిక గ్యాస్ స్టేషన్ వెలుపల జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
తుపాకీ గాయంతో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కాల్పులకు ముందు నిందితుడు గ్యాస్ స్టేషన్ ముందు నిలబడి ఉన్నట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
871059