బీసీ కౌన్సిల్ సభ్యుడు ఉపేంద్ర మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) ద్వారా దేశం కూడా మొదటి స్థాయికి చేరుకుంటుందని, తెలంగాణను అతి తక్కువ కాలంలో దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు, అణగారిన వర్గాల అభివృద్ధికి, సామాజిక న్యాయాన్ని చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారని ఒక ప్రకటనలో తెలిపారు. యాదవుల ఆర్థికాభివృద్ధికి ఉచితంగా గొర్రెలు, మత్స్యకారుల అభివృద్ధికి చేప పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్న వెయ్యికి పైగా గురుకులాల్లో బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామన్నారు.
నేషనల్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోందన్నారు. గత ఎనిమిదేళ్లలో స్వరాష్ట్రం సాధించిన అభివృద్ధిని చూసి దేశం ఆశ్చర్యపోయిందని, అదే తరహాలో ఇతర రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని ఆయన శనివారం అన్నారు. దేశ ప్రజల అభీష్టం మేరకే భారత్ రాష్ట్ర సమితిని స్థాపించామన్నారు.