ముంబై: మహారాష్ట్రలోని పూణెలోని మార్వెల్ విస్టా భవనం పై అంతస్తులో మంగళవారం మంటలు చెలరేగాయి. ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉంది. లూలా నగర్ చౌక్‌లోని మార్వెల్ విస్టా భవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు రంగంలోకి దిగారు.
మంటలను అదుపు చేసేందుకు ఆరు అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
821107