
గవర్నర్ తమిళి సాయిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజకీయ అంశాలు ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా మాట్లాడారని అన్నారు. గవర్నర్ తీరుపై త్వరలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని మంత్రి తెలిపారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడటం ఏమిటని తలసాని ప్రశ్నించారు.