
గాజా: పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గాజా స్ట్రిప్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో 21 మంది సజీవ దహనమయ్యారు. వారిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. గాజాలోని అత్యంత జనసాంద్రత గల ప్రాంతంలోని జబాలియా శరణార్థి శిబిరం ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం, చివరి అంతస్తులో మంటలు ప్రారంభమయ్యాయి మరియు క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అగ్ని ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభివర్ణించారు. అదే సమయంలో భవనంలోని ఓ గదిలో ఇంధనం నిల్వ ఉండడమే అగ్నిప్రమాదానికి కారణమని సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతినిధులు తెలిపారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల శిబిరాల్లో జబాలియా ఒకటి. ఇక్కడ రెండు లక్షల ముప్పై వేల మంది నివసిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా మారింది.
844068