అహ్మదాబాద్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థుల కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న ఆప్ గుజరాత్ లోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం సూరత్‌లో ఆప్ సీఎం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ గుజరాత్లో తదుపరి సీఎం ఎవరో చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తెలియజేసేందుకు మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని ప్రజలకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని తెలిపారు. నవంబర్ 4న ఫలితాలను ప్రకటిస్తామని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తెలిపారు.
గుజరాత్లో పట్టు సాధించాలని యోచిస్తున్న ఆప్.. రాష్ట్రంలో అనేక ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి గుజరాత్లో అధికారం చేపడితే ఉచిత విద్యుత్, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని అనేక వాగ్దానాలు చేసింది.
817439