ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని సూరత్ హన్స్‌పురా అసోసియేషన్‌లో శనివారం చోటుచేసుకుంది.
కుక్క దాడిలో బాలిక ముఖంపై పలు గాయాలయ్యాయి. ఇది గమనించిన బాలిక తల్లి వెంటనే అక్కడికి చేరుకుని కుక్క బారి నుంచి చిన్నారిని రక్షించింది. ఈ క్రమంలో బాలిక తల్లిని కూడా వీధి కుక్క కరిచింది.
ఇంతలో ఇరుగుపొరుగు వారు వచ్చి కుక్కను తరిమేశారు. కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
చిన్నారి ముఖంపై కుట్లు పడి ఉన్నాయని వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
సూరత్‌లో వెర్రి కుక్క బాలికపై దాడి చేసి, ఆమె చెంప కొరికిన తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లింది #సూరత్ #కుక్కపిల్ల #వీధి కుక్క pic.twitter.com/xNtzXOIlD2
— గుజరాత్ (@GujaratTak) జనవరి 9, 2023