బీజింగ్: చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ సిటీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ వర్క్‌షాప్‌లో మంటలు చెలరేగి 36 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత, అన్యాంగ్ సిటీలోని “హైటెక్ జోన్”లో మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రం పదకొండు గంటల వరకు ఏడెనిమిది గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మంగళవారం ఉదయం వరకు ఈ ప్రమాదంలో 36 మంది మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
849619