పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన తెలంగాణకు మరో భారీ పెట్టుబడితో అంతర్జాతీయ కంపెనీ రాబోతోంది. తాజాగా అత్తారో ఇండియా అనే సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు.
ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను @AtteroIndia తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీని నిర్మించేందుకు రూ.600 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు
ప్రతిపాదిత సదుపాయం 300 మందికి పైగా ప్రత్యక్షంగా మరియు అనేక మందికి పరోక్ష ఉపాధిని అందిస్తుంది pic.twitter.com/qaxbTlHapf
— కేటీఆర్ (@KTRTRS) అక్టోబర్ 31, 2022
రాష్ట్రంలో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అత్తారో ఇండియా కంపెనీ ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి పొందనున్నారు. వేల సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.