
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదైందని జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. ధర్మశాలకు 76 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జోష్మత్ భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత ధర్మశాలలో భూమి కంపించింది. రోజురోజుకు కుప్పకూలుతుండగా శుక్రవారం తెల్లవారుజామున 2.12 గంటలకు జోషిమఠ్లో 2.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.