హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి డీజే మ్యూజిక్, గంజాయితో ఆర్భాటంగా రేవ్ పార్టీ నిర్వహిస్తున్న పోలీసులు దాడి చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర పేట సమీపంలోని పసుమాముల గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో ఇంజినీరింగ్ విద్యార్థులు కొందరు రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేయగా అక్కడ వ్యక్తులు గంజాయి తాగుతున్నట్లు గుర్తించారు.
వివిధ కాలేజీల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అర్ధరాత్రి పార్టీ పెట్టుకున్నారని, అనుమతి లేకుండానే డీజే గంజాయిని వినియోగించారని పోలీసులు తెలిపారు. గంజాయి తాగుతూ పట్టుబడిన ఆరుగురిపై మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద, మిగిలిన వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. ఫాంహౌస్ మేనేజర్ సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో మొత్తం 37 మందిపై అభియోగాలు నమోదు చేసినట్లు హయత్ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీలు, వేడుకల పేరుతో యువత డ్రగ్స్ వాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరించారు. వివిధ రంగాల్లో అనేక అవకాశాలున్నాయని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.