న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీలోని పాటియాలా ప్యాలెస్ కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం తాత్కాలిక బెయిల్‌పై ఉన్న ఆమె తన రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును విచారించేందుకు న్యాయవాది ప్రశాంత్ పాటిల్‌తో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఈసారి కోర్టు ఆమెకు తాత్కాలిక బెయిల్‌ను నవంబర్ 10 వరకు పొడిగించింది.
అలాగే జాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 10న జరగనుంది. ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ సహా పలువురిపై రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) ఆమెను పలుమార్లు విచారించి ఆమె ఆస్తులను సీజ్ చేసింది.
తాత్కాలిక బెయిల్‌పై ఉన్న జాక్వెలిన్.. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. సుకేష్ చంద్రశేఖర్ నుంచి ఆమెకు కోటి రూపాయల బహుమతి వచ్చినట్లు ఈడీ విచారణలో తేలింది. అందుకే ఆమె రూ.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఆ డబ్బు తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని జాక్వెలిన్ చెప్పింది.
#చూడండి 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో క్రూక్ సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కోసం నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు వచ్చారు. pic.twitter.com/1odhntu1R4
– ANI (@ANI) అక్టోబర్ 22, 2022
810069