హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ నియామక ప్రక్రియలో భాగంగా మరో 134 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
పాఠశాల విద్యా డైరెక్టర్ల పరిధిలోని 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఆమోదం తెలిపింది. వీటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) భర్తీ చేస్తుంది.
దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. మాటలు కాదు చర్యలు – సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రం ఇదేనని స్పష్టం చేశారు. 134 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని మంత్రి హరీశ్ రావు తన ట్వీట్లో షేర్ చేశారు.
ఉద్యోగార్ధులకు శుభవార్త, #తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం 134 పోస్టులను భర్తీ చేయడానికి TSPSC ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రభుత్వం ఆమోదించింది.
మాటలు కాదు చర్యలు – ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రం #CMKCR గారూ నాయకత్వం. pic.twitter.com/iZtyKIbJMD
— హరీష్ రావు తన్నీరు (@trsharish) నవంబర్ 12, 2022